Header Banner

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ISI ఏజెంట్! పహల్గాం ఉగ్రదాడికి ముందు పాక్ కు సంచలన విషయాలు వెల్లడి!

  Mon May 19, 2025 08:45        India

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త సద్దుమణుగుతున్న తరుణంలో, జ్యోతి మల్హోత్రా అనే మహిళ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హర్యానాలో పుట్టి, పాకిస్థాన్ గూఢచారిగా మారిన ఆమె కథ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.


'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తన మాటలతో, అందాలతో లక్షలాది మందిని ఆకర్షించిన జ్యోతి మల్హోత్రా అసలు ముఖం 2023లో పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడే బయటపడింది. అక్కడ ISI ఏజెంట్ డానిష్‌తో పరిచయం ప్రేమగా మారి, చివరకు దేశద్రోహానికి దారితీసింది.



యూట్యూబర్ ముసుగులో భారత సైనిక స్థావరాలను చిత్రీకరించి, మన దేశ రహస్యాలను పక్కాగా డానిష్‌కు చేరవేసింది. చివరికి 2024లో హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో సంచరిస్తూ సైనికుల కదలికలను చేరవేస్తుండగా అనుమానం వచ్చి అరెస్టయ్యింది. ఆమె ఫోన్ పరిశీలించగా టెర్రరిస్టులతో సంబంధాలున్నట్లు నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా, జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది.

 

ఇది కూడా చదవండి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె హంగామా చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అప్పటి బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఆమె అతిగా ప్రవర్తించిన దృశ్యాలు చూసి హైదరాబాదీలు షాక్‌కు గురవుతున్నారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అప్పుడే ఈ విషయం తెలిసి ఉంటే ఇక్కడే పాతేసేవాళ్ళం" అంటూ తీవ్రమైన కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఆమె యూట్యూబర్ కాదని మహా ముదురని కామెంట్స్ చేస్తున్నారు. దేశద్రోహి ఒకప్పుడు తమ నగరంలో సందడి చేసిందన్న వార్త వారిని కలచివేస్తోంది.

 

యూట్యూబ్ ట్రావెలింగ్ పేరుతో దేశంలోని కీలక ప్రాంతాల్లో పర్యటించి సమాచారం సేకరించడం ఆమె వ్యూహంలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. అందమైన ముఖం వెనుక దాగున్న దేశద్రోహి అసలు రూపం ఇప్పుడు అందరినీ భయానికి గురిచేస్తోంది. ప్రేమ పేరుతో దేశ రహస్యాలు శత్రుదేశానికి చేరవేయడం ఎంతటి దారుణమో ఈ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది. జ్యోతి మల్హోత్రా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HyderabadNews #ISIAgent #NationalSecurity #PahalgamAttack #TerrorAlert #PakistanISI